ETV Bharat / crime

ఇటుక బట్టీ కోసం విద్యుత్ చౌర్యం.. కేసు నమోదు

ఇటుక బట్టీ కోసం విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా ఇస్సాపల్లి గ్రామ శివారులో బట్టీ నిర్వహించే ఓ వ్యక్తి అనుమతులు లేకుండా కరెంట్ వాడడాన్ని అధికారులు గుర్తించారు. రూ.24 వేల జరిమానా విధించారు.

case file on illegal electricity, issapalli  illegal electricity
ఇస్సాపల్లిలో అనుమతులు లేకుండా కరెంట్ వాడకం, విద్యుత్ చౌర్యంపై కేసు నమోదు
author img

By

Published : May 21, 2021, 7:11 AM IST

విద్యుత్ చౌర్యం చేసి వ్యాపార అవసరాలకు వాడుకుంటున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం ఇస్సాపల్లిలో చోటుచేసుకుంది. మాడినేని వెంకటేశ్వరరావు అలియాస్ ఆంధ్ర బుజ్జి ఇస్సాపల్లి గ్రామ శివారులో ఇటుక బట్టీ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కరెంట్ వాడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు విద్యుత్ శాఖ ఆర్మూర్ ఏడీఈ జనార్దన్ శ్రీధర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఇటుక బట్టీలో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. విద్యుత్ చౌర్యం సెక్షన్ కింద కేసు నమోదు చేసి రూ.24 వేల జరిమానా విధించినట్లు ఆయన చెప్పారు. అనుమతులు తీసుకుని కరెంట్ వాడుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: ఈ లక్షణాలు ఉన్నాయా? బ్లాక్​ ఫంగస్​ కావచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.