Car Fire In Nellore District: ఏపీలోని నెల్లూరు నగరం పొదలకూరు రోడ్డు సెంటర్లో ఓ కారు క్షణాల్లో కాలి బూడిదైంది. పద్మావతి సెంటర్లోని ఓ మద్యం దుకాణం ముందు ఉన్న కారుపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో భారీ ఎత్తున మంటలు చేలరేగాయి.
ఉవ్వెత్తున ఎగసిపడ్డ మంటలతో ఆ మార్గంలో వెళ్తున్న ప్రయాణీకులు బెంబేలెత్తారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అర్పేశారు. కారులో ఎవరూ లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పింది.
మద్యం షాపు నిర్వాహకులకు కారు ఓనర్‌కి మధ్య వివాదంలో భాగంగానే కారును తగలబెట్టారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లి.. ముగ్గురు విద్యార్థులు గల్లంతు!