భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కారు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చిరంజీవి అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి భద్రాచలం మీదుగా వైజాగ్ వెళ్తున్నాడు. ఆ క్రమంలో భద్రాచలంలోని శాంతినగర్ కాలనీ వద్దకు రాగానే కారులోంచి విపరీతమైన పొగలు వచ్చాయి.
అప్రమత్తమైన డ్రైవర్ కారునుంచి దిగి పోయి కేకలు వేశాడు. స్థానికులు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. చివరకు చుట్టుపక్కల ఇళ్ల నుంచి నీళ్ల పైపు తీసుకువచ్చి మంటలను ఆర్పారు. మంటలు ఆర్పడానికి స్థానికులు చాలా కష్టపడాల్సి వచ్చింది. మంటలు ఆరిపోయిన తర్వాత స్థానికంగా ఉండే అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలం వద్దకు చేరారు.
ఇదీ చూడండి : 'సమస్యల పరిష్కారానికి ఎన్నికలను వేదిక చేసుకోవాలి'