ETV Bharat / crime

మద్యం తాగి బస్సు నడిపిన డ్రైవర్ అరెస్ట్​ - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

మద్యం తాగి బస్సు నడిపి ఇద్దరు కార్మికుల దుర్మరణానికి కారణమైన డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన రిమాండ్​కు తరలించిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో చోటు చేసుకుంది.

మద్యంతాగి బస్సు నడిపిన డ్రైవర్ అరెస్ట్​
మద్యంతాగి బస్సు నడిపిన డ్రైవర్ అరెస్ట్​
author img

By

Published : Jun 12, 2021, 7:45 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జాతీయ రహదారి పక్కన శుక్రవారం రాత్రి జలమండలి పైపులైను పనుల్లో పని చేస్తున్న బీహార్‌కు చెందిన రాజ్​కుమార్, ఒడిషాకు చెందిన అర్జున్ పనులు ముగించుకుని వెళ్తున్నారు. అదే సమయంలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ కార్మికులను గండిమైసమ్మ నుంచి తీసుకొచ్చేందుకు పటాన్​చెరు నుంచి వెళ్తున్న బస్సు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

డ్రైవర్ బీరప్ప అజాగ్రత్తగా, అతివేంగా బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తేలింది. దీంతో అతడని అదుపులోకి తీసుకున్నారు. బీరప్ప మద్యం తాగి అజాగ్రత్తగా బస్సు నడిపి ఇద్దరు కార్మికుల మృతికి కారణమైనందున రిమాండ్​కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: చీఫ్​ జస్టిస్​ను కలిసిన సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.