ETV Bharat / crime

Janga Reddy Passed Away : భాజపా మాజీ ఎంపీ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

author img

By

Published : Feb 5, 2022, 8:46 AM IST

Updated : Feb 5, 2022, 12:00 PM IST

Janga Reddy Passed Away : భాజపా సీనియర్ నేత, మాజీ ఎంపీ జంగారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర భాజపా నేతలు సంతాపం ప్రకటించారు. జన్​సంఘ్, భాజపాను విజయ శిఖరాలకు చేర్చే ప్రయత్నంలో జంగారెడ్డి తన వంతు కృషి చేశారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. జంగారెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Janga Reddy Passed Away
Janga Reddy Passed Away

Janga Reddy Passed Away : భాజపా సీనియర్ నేత, మాజీ ఎంపీ జంగారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్​లో చికిత్స పొందుతూ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. జంగారెడ్డి మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఇతర నేతలు సంతాపం ప్రకటించారు. అయన మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Janga Reddy Passes Away : జంగారెడ్డి పార్థివదేహాన్ని కొండాపూర్​లోని ఆస్పత్రి నుంచి నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. కాషాయ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం నాంపల్లి నుంచి జంగారెడ్డి భౌతికకాయాన్ని ఆయన స్వస్థలం పరకాలకు తరలించారు.

BJP Leader Janga Reddy Died Today : 1935లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరకాలలో జన్మించిన జంగారెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలోనూ తనవంతు పాత్ర పోషించారు. జన సంఘ్‌ కార్యకర్త నుంచి ఎంపీగా ఎదిగిన జంగారెడ్డి భాజపాలో క్రియాశీలకంగా వ్యవహరించారు. పరకాల, శాయంపేట నుంచి శాసనసభ్యుడిగా, హనుమకొండ నుంచి ఎంపీగా పనిచేశారు. 1984లో 8వ లోక్‌సభ ఎన్నికల్లో హనుమకొండ నుంచి పీవీ నరసింహారావుపై విజయం సాధించి చరిత్ర సృష్టించారు. 1984లో జరిగిన లోకసభ ఎన్నికల్లో భాజపా దేశవ్యాప్తంగా కేవలం రెండు స్థానాలు గెలుపొందగా అందులో జంగారెడ్డి ఒకరు.

కార్యకర్తలకు ప్రేరణ..

జంగారెడ్డి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారని కొనియాడారు. జన్​సంఘ్, భాజపాను విజయ శిఖరాలకు చేర్చే ప్రయత్నంలో తన వంతు కృషి చేశారని అన్నారు. ప్రజల నేతగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. ఎంతో మంది కార్యకర్తలను ప్రేరేపించిన జంగా రెడ్డి మరణం.. భాజపాకు తీరని లోటని మోదీ ట్వీట్ చేశారు.

సీఎం సంతాపం

భాజపా మాజీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎన్నో గెలుపు శిఖరాలను తాకిన వ్యక్తి

రాష్ట్రంలో భాజపా వ్యవస్థాపకుల్లో జంగారెడ్డి ఒకరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతు కుటుంబంలో జన్మించిన జంగారెడ్డి.. కష్టపడి పైకొచ్చిన నాయకుడని కొనియాడారు. జనం మధ్యే ఉంటూ అనేక సార్లు గెలుపు శిఖరాలను తాకిన మహనీయుడని ప్రశంసించారు.

ధైర్యంగా మాట్లాడే వ్యక్తి..

జంగారెడ్డి.. నిర్మొహమాటంగా, ధైర్యంగా మాట్లాడే వ్యక్తిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన ఆర్​ఎస్​ఎస్​లో క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన చివరి శ్వాస వరకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని.. అతని ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు పాటుపడతామని బండి సంజయ్ పేర్కొన్నారు.

Last Updated : Feb 5, 2022, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.