ETV Bharat / crime

ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన అచ్చంపేటలోని చెన్నారం గేటు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

bikes-accident-at-achampet-and-teo-members-died
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం
author img

By

Published : Apr 22, 2021, 9:42 AM IST

నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం గేటు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. బోల్గట్‌పల్లి గ్రామానికి చెందిన చందర్‌ నాయక్‌(25), రవీందర్‌ నాయక్‌(27) అనే యువకులు మృతిచెందారు.

బోల్గట్‌పల్లికి చెందిన చందర్‌, రవిందర్‌ బుల్లెట్‌ వాహనంపై మైసిగండి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. మరో ద్విచక్రవాహనంపై ఉన్న సుందరయ్య(సింగారం), సాయిబాబు(హజీపూర్‌) డిండి వైపు వస్తున్నారు. మార్గమధ్యంలోని చెన్నారం గేట్‌ వద్ద వీరి వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నారు. ఘటనలో చందర్‌ అక్కడికక్కడే మృతిచెందగా... రవీందర్‌, సాయిబాబులకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో రవీందర్‌ మృతిచెందాడు. సుందరయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతిచెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. రవీందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు తెలిపారు.

ఇదీ చూడండి: అదనపు కట్నం వేధింపులకు ముగ్గురు బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.