ETV Bharat / crime

రెచ్చిపోయిన బైక్​ రైడర్స్​.. ఆర్టీసీ డ్రైవర్​పై దాడి - విశాఖలో బైక్ ర్యాలీతో బీభత్సం

Bus damage: విశాఖ నగరంలో అర్ధరాత్రి కొంతమంది యువకులు బైక్ ర్యాలీతో బీభత్సం సృష్టించారు. అడ్డువచ్చిన ఆర్టీసీ బస్సును ధ్వంసం చేసి, డ్రైవర్​పై దాడిచేసి గాయపరిచారు. రాత్రి 12 గంటల నుంచి 3గంటల వరకు కొందరు యువకులు ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వీరంగం సృష్టించారు.

Bus damage
Bus damage
author img

By

Published : Jul 11, 2022, 1:53 PM IST

రెచ్చిపోయిన బైక్​ రైడర్స్​.. ఆర్టీసీ డ్రైవర్​పై దాడి

Bike Riders attack on RTC Bus: ఏపీలోని విశాఖ నగరంలో అర్ధరాత్రి కొంతమంది యువకులు బైక్ ర్యాలీతో బీభత్సం సృష్టించారు. అడ్డువచ్చిన ఆర్టీసీ బస్సును ధ్వంసం చేసి, డ్రైవర్​పై దాడిచేసి గాయపరిచారు. రాత్రి సుమారు 12 గంటల నుంచి వేకువజామున 3 గంటల వరకు.. కొంతమంది యువకులు ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ.. వీరంగం సృష్టించారు. ఆర్టీసీ కాంప్లెక్స్, స్వర్ణభారతి స్టేడియం కూడలి, బీచ్ రోడ్డులో బైక్ రైడ్ చేస్తూ.. హల్​చల్ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్​లో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు అడ్డుగా వెళ్లారు. సైడ్ ఇవ్వాలని బస్సు డ్రైవర్ కోరడంతో.. రెచ్చిపోయిన యువకులు బస్సు ధ్వంసానికి పాల్పడ్డారు.

వారించేందుకు వెళ్లిన డ్రైవర్​పై దాడి చేసి గాయపరిచారు. శనివారం అర్ధరాత్రి జరగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బైక్ రైడ్స్ నిర్వహించిన 35 మందిని గుర్తించారు. డ్రైవర్​పై దాడికి పాల్పడిన యువకుడితో.. పాటు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. బైక్ రైడర్స్ వినియోగించిన వాహనాలను సైతం సీజ్ చేయనున్నామని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:

దంచికొడుతున్న వానలు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

మీ ఫోన్​లో ఈ యాప్స్​ ఉంటే వర్షం రాక.. పిడుగు గుర్తింపు.. సులువే

ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల ఘర్షణ.. విరిగిన కుర్చీలు.. పగిలిన అద్దాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.