ETV Bharat / crime

పట్టపగలే చోరీ: ఆస్పత్రికి వెళ్లి వచ్చేలోపే దోచేశారు! - పట్టపగలే చోరీకి పాల్పడిన దుండగులు

చోరీలు చేసేందుకు రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇళ్లను గుల్ల చేస్తున్నారు. పట్టపగలే ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఇంట్లో బీరువాను పగలగొట్టిన దొంగలు రూ.7 లక్షల నగదు, 11 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​లో ఈ సంఘటన జరిగింది.

theft in macherial district ramakrishnapur
సింగరేణి కార్మికుని ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు
author img

By

Published : Jan 26, 2021, 9:18 PM IST

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. శ్రీరాంపూర్​లో సింగరేణి కార్మికునిగా పనిచేస్తున్న రాజలింగం ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. ఇంట్లో బీరువాను పగలగొట్టి రూ.7 లక్షల నగదు, 11 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

theft in macherial district ramakrishnapur
పట్టపగలే చోరీ.. భారీగా నగదు, ఆభరణాలు మాయం

పట్టణంలోని విద్యానగర్​లో నివాసముంటున్న రాజలింగం ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మంచిర్యాలలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండడం చూసి అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే జాగిలాలను రప్పించి తనిఖీలు చేపట్టిన ఎలాంటి లాభం లేకుండా పోయింది. స్థానిక ఎస్సై రవిప్రసాద్​ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నాారు. అనంతరం వేలిముద్రల నిపుణులను రప్పించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

ఇదీ చూడండి : ఒళ్లు గగుర్పొడిచే కిల్లర్ కథ... 18 హత్యల వెనుక క్రైం కహానీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.