ETV Bharat / crime

Loan Apps Case : నగదు బదిలీలో బ్యాంక్ అధికారుల హస్తం!

రుణయాప్‌ నిర్వాహకుల ఖాతాల నుంచి అక్రమంగా నగదు బదిలీ వ్యవహారంలో సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్తంభింప చేసిన ఖాతాల్లో నుంచి బదిలీ అయిన సొమ్ము చైనాకు చేరి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారుల హస్తం ఉండొచ్చనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

loan apps case, loan apps case in telangana
రుణయాప్​ కేసు, రుణయాప్ కేసు అప్​డేట్స్, తెలంగాణలో రుణయాప్ కేసు
author img

By

Published : Jun 8, 2021, 8:37 AM IST

రుణయాప్‌ల కేసులో స్తంభింపజేసిన బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయం కావడంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. రుణయాప్‌ నిర్వాహకులకు సంబంధించిన 100 ఖాతాలను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు స్తంభింపజేశారు. ఆయా ఖాతాల్లోని దాదాపు 200కోట్ల నగదు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా నిలిపేశారు. ఐతే కోల్‌కతా న్యూ అలీపూర్‌ ఐసీఐసీఐ శాఖలో ఉన్న 2 ఖాతాల నుంచి 90 లక్షలకు పైగా నగదు బదిలీ అయింది. దిల్లీ, హరియాణాలోని మరో నాలుగు ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాల నుంచి 28 లక్షల నగదు తమ అకౌంట్లలోకి బదిలీ చేసుకున్నారు. మొత్తం కోటి 18లక్షల రూపాయలు ఆనంద్‌ పేరిట ఉన్న ఎస్బీఐ ఖాతాకు బదిలీ అయినట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు.

నగదు బదిలీలో బ్యాంక్ అధికారుల హస్తం!

ఎస్సైగా వెళ్లి..

గత నెల 13న కోల్‌కతావెళ్లిన ఆనంద్‌.. సైబర్‌ క్రైం ఎస్సైగా పరిచయం చేసుకొని ఆరు బ్యాంకు ఖాతాలను అన్‌ఫ్రీజ్‌ చేయించాడు. అందులోని నగదును బదిలీ చేయించాడు. ఆనంద్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు ప్రస్తుతం అతడి వెనుక ఎవరున్నారని వివరాలు సేకరిస్తున్నారు. బేగంపేటకు చెందిన ఆనంద్.. రుణ యాప్ కాల్ సెంటర్‌కు తరచూ వెళ్లినట్లు. సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. అతడు కేవలం ఖాతా సమకూర్చాడా? లేక ప్రత్యక్ష సంబంధాలేమైనా ఉన్నాయా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

28 మంది అరెస్టు..

ఆనంద్‌ ఎస్బీఐ ఖాతాను పోలీసులు స్తంభింపచేశారు. అప్పటికే అతని ఖాతాలో జమ అయిన కోటీ 18లక్షలు వేరొక ఖాతాకు అక్కడి నుంచి చైనాకు బదిలీ అయినట్లు సైబర్ క్రైం పోలీసులు అనుమానిస్తున్నారు. రుణ యాప్ కేసులో పోలీసులు మొత్తం 28మందిని అరెస్ట్ చేశారు. అందులో ప్రధాన సూత్రధారి ల్యాంబో, కాల్ సెంటర్ల నిర్వాహకుడు నాగరాజు, మేనేజర్‌ తప్ప మిగతా అందరూ బెయిల్ పై విడుదలయ్యారు. నగదు బదిలీ వ్యవహారంలో వీళ్ల హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితురాలు జెన్నీఫర్ చైనాలో తలదాచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. జెన్నీఫర్ చైనాలో ఉండి స్తంభింపజేసిన ఖాతాల్లోని నగదు మళ్లించేందు పథకం వేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

బ్యాంక్ అధికారుల హస్తం..

ఏప్రిల్‌లో హైదరాబాద్ సైబర్ సెల్ పేరిట పలు ఐసీఐసీఐ శాఖలకు లేఖలు వెళ్లాయి. 39 బ్యాంకు ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయాలని ఆ లేఖలో కోరారు. ఈ విషయాన్ని గచ్చిబౌలిలోని ఐసీఐసీఐ ప్రధాన కార్యాలయం ప్రతినిధులు సైబర్ క్రైం దృష్టికి తీసుకొచ్చారు. అలాంటి లేఖలేవి సైబర్ క్రైం పోలీసులు రాయలేదని వారు తేల్చి చెప్పారు. అయితే కోల్‌కతా న్యూ అలీపూర్‌ ఐసీఐసీఐ సిబ్బంది.. ఖాతాలు అన్‌ఫ్రీజ్‌ చేసేటపుడు సైబర్‌క్రైం అధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం తమ శాఖలోని ఖాతాలను అన్ ఫ్రీజ్ మాత్రమే చేయాలి. కానీ అలీపూర్ బ్రాంచ్‌ సిబ్బంది.. ఇతర శాఖల ఖాతాలను అన్ ఫ్రీజ్ చేయడంలో బ్యాంకు అధికారుల హస్తం ఉండొచ్చని సైబర్ క్రైం పోలీసులు అనుమానిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.