మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధి ఎల్లమ్మబండ పీజేఆర్నగర్లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. రవి అనే వ్యక్తిని నలుగురు పక్కకాలనీ వాసులు దాడి చేశారు. ఆపేందుకు వెళ్లిన అర్జున్ అనే వ్యక్తిపై పోకిరీలు బ్లేడుతో దాడికి దిగారు.
అర్జున్ పొట్టభాగంలో గాట్లు పడగా.. రక్తస్రావం కావడంతో.. స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ అర్జున్ ఆటో డ్రైవర్ అని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిలో ఒకరు సన్ని అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి: అనుమానంతో భార్యను అతికిరాతకంగా చంపిన భర్త!