మైనర్ బాలికను అపహరించి బలవంతంగా పెళ్లి చేసుకోబోయిన కేసులో నిందితుడు శ్రవణ్ కుమార్‌కు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు(fast track court) నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2015 సెప్టెంబరులో రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన 13ఏళ్ల బాలిక(minor girl kidnap in saroor nagar 2015)ను అదే ప్రాంతానికి చెందిన శ్రవణ్ కుమార్ అనే యువకుడు వెంటపడి వేధించాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు అతడిని మందలించారు.
మరుసటి రోజు బాలిక నడుచుకుంటూ పాఠశాలకు వెళుతున్న సమయంలో కర్మన్‌ఘాట్ సమీపంలో కారులో వచ్చి ఆమెను అపహరించాడు. బలవంతంగా మెడలో తాళి కట్టబోతుండగా బాలిక కేకలు వేయడంతో భయంతో అక్కడినుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు.. సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన కోర్టు నిందితుడికి 4 ఏళ్ల(fast track court) కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10వేల జరిమానా విధించింది.
ఇదీ చదవండి: Telangana Police: ఖాకీల అత్యుత్సాహం.. వరుస సంఘటనలతో పోలీసుశాఖకు అప్రతిష్ట
Attack on Actress : కేబీఆర్ పార్కులో వాకింగ్‌కు వెళ్లిన నటిపై దాడి