ద్విచక్రవాహనంపై వెళుతోన్న భాను ప్రసాద్ అనే యువకుడిని ఎదురుగా వస్తోన్న లారీ ఢీ కొట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం సమీపంలోని స్పిన్నింగ్ మిల్లు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
భువనగిరి పట్టణ కేంద్రానికి చెందిన వాసం భాను ప్రసాద్ ద్విచక్రవాహనంపై భువనగిరి నుంచి బీబీనగర్ వైపు వెళుతున్నాడు. ఈ క్రమంలో స్పిన్నింగ్ మిల్లు వద్ద ఎదురుగా వస్తోన్న లారీ అతన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: భార్యను కత్తితో నరికి... భర్త ఆత్మహత్య