వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం రంగాపురం వద్ద బొలేరో వాహనాన్ని కారు ఢీకొనడంతో 10 కూలీలు గాయపడ్డారు. కొత్తకోట మండలం అప్పరాలకు చెందిన 20 మంది కూలీలు బొలేరో వాహనంలో పెంచికలపాడ్లో మిరప పండ్లు తెంపడానికి కూలీకి వెళ్లారు. పనులు ముగించుకొని గ్రామానికి వస్తుండగా.. రంగాపురం వద్ద జాతీయ రహదారిపైకి యూటర్న్ తీసుకుంటుండగా.. కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న కారు ఢీకొట్టింది.
ఈ ఘటనలో బొలేరో వాహనంలో ఉన్న కూలీలు భారతమ్మ, విమలమ్మ, ఇందిరమ్మ, నర్సమ్మ, లక్ష్మి, చిలుకమ్మ, బీసమ్మ, పార్వతమ్మలు గాయపడ్డారు. మిగతా కూలీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డ వారిలో భారతమ్మ, చిలుకమ్మ, బీసమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వీరిని మెరుగైన చికిత్స కోసం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పెబ్బేర్ పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: బ్యాంకులో చోరీకి గురైన సొమ్ము విలువ రూ.3.10 కోట్లు: సీపీ