ETV Bharat / crime

భర్తతో గొడవ.. ఆత్మహత్య చేసుకున్న భార్య - పటాన్​చెరు నేరవార్తలు

భర్తతో గొడవ పడ్డ ఆశా కార్యకర్త ఆత్మహత్య చేసుకుంది. శనివారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

aasha worker committed suicide after conflict with husband
భర్తతో గొడవ.. ఆత్మహత్య చేసుకున్న భార్య
author img

By

Published : Jun 13, 2021, 8:23 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఐనోల్​ గ్రామంలో కుటుంబకలహాలతో మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐనోల్​కు చెందిన లావణ్య ఆశావర్కరుగా పనిచేస్తుండగా.. ఆమె భర్త కృష్ణ వ్యవసాయం చేస్తుంటాడు. లావణ్య తండ్రి నర్సింహులుకు నగదు అవసరం ఉండటంతో భార్యాభర్తలు కలిసి 50 వేల రూపాయలు ఇచ్చారు.

కొంతకాలంగా మద్యానికి బానిసైన కృష్ణను తాగడం మానేయాలని లావణ్య భర్తకు చెప్పింది. ఈనేపథ్యంలో దంపతుల మధ్య మాటా మాటా పెరిగింది. లావణ్య తండ్రికి ఇచ్చిన డబ్బుల విషయంపై కృష్ణ పరుషంగా మాట్లాడాడు. మనస్తాపం చెందిన లావణ్య శనివారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.