A young man with a gun is hustling near Bahadoorpura petrol station: హైదరాబాద్ పాతబస్తీ బహదూర్ పురా ఠాణా పరిధిలో ఓ యువకుడు తుపాకీతో హల్చల్ చేశాడు. బహదూర్ పురా ప్రధాన రహదారిపై ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకోవడానికి ద్విచక్ర వాహనంపై యువకుడు వచ్చాడు. పెట్రోల్ పోసుకున్న తరవాత డబ్బులను యూపీఐ ద్వారా చెల్లిస్తానని చెప్పాడు. కానీ మనీ ట్రాన్స్ఫర్ కాకపోవడంతో బంక్ నిర్వాహకులు అతనిని నగదు ఇవ్వమన్నారు. తన యూపీఐ పనిచేయకపోవడంతో నగదు బదిలీ కాలేదు.
డబ్బులు ఇవ్వాలని నిర్వాహకులు అడిగినందుకు ఆ యువకుడు వారితో గొడవకు దిగాడు. తమ మిత్రులు మరో ఇద్దరికి ఫోన్ చేసి అక్కడకు పిలిపించాడు. ద్విచక్ర వాహనంపై మరో ఇద్దరు యువకులు అక్కడికి చేరుకోగా వచ్చిన వారిలో ఓ యువకుడు తుపాకి బయటకు తీసి భయబ్రాంతులకు గురిచేశాడు. ముగ్గరూ కలిసి బంక్ కార్యాలయాన్ని ధ్వంసం చేసి, క్యాషియర్‌పై సైతం దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేస్తుండగా ముగ్గురిలో ఇఫ్తికర్ అనే యువకుడికి గాయాలయ్యాయి.
దీంతో ఎదురు దాడికి దిగిన బంక్ సిబ్బంది ఇఫ్తికర్ అనే యువకుడిని పట్టుకున్నారు. ఇంతలోనే మరో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం బంక్ నిర్వాహకులు బహదూర్ పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పట్టుబడిన ఇప్తికర్ ఫలకనుమాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గాయాలు కావడంతో ఇఫ్తికర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గన్‌తో హల్చల్ చేసిన యువకుడితో పాటు మరో యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: