జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యమపూర్ గ్రామానికి చెందిన చింతకుంట కృష్ణంరాజు అనే యువకుడికి ఈ నెల 13న వివాహం జరిగింది. పెళ్లి అయిన 3 రోజులకు కరోనా లక్షణాలు కనిపించడంతో కుటుంబసభ్యులంతా పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
అప్పటి నుంచి అందరూ ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే రాజుకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో రాజు మంగళవారం మరణించాడు. పెళ్లైన 13 రోజులకే నవ వరుడు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.