ETV Bharat / crime

ఆన్​లైన్​ బెట్టింగులకు బానిసై అప్పులపాలయ్యాడు.. కట్​ చేస్తే చివరకు.. - బెట్టింగ్​లో అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య

Engineer Commits Suicide in Secunderabad: ఆన్​లైన్​ బెట్టింగ్​కి అలవాటు పడి ఎంతో మంది యువకుల జీవితాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొంతమంది బెట్టింగ్​లో డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలైపోతున్నారు. దీని ప్రభావంతో ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. తాాజాగా ఇలాంటి ఘటనే సికింద్రాబాద్​లో వెలుగుచూసింది.

Engineer Commits Suicide in Secunderabad

author img

By

Published : Jan 24, 2023, 3:44 PM IST

Engineer Commits Suicide in Secunderabad: సికింద్రాబాద్​లో ఆన్​లైన్ బెట్టింగ్​లో డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చంపాపేట్ సాయిరాంనగర్ నివాసం ఉండే మోహన్ కృష్ణ (24) ఓ సంస్థలో అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్​గా పని చేస్తున్నాడు. తండ్రి మూడేళ్ల క్రితమే చనిపోవడంతో తల్లి, అన్నయ్య, వదినలతో కలిసి ఉంటున్నాడు. కొంతకాలంగా ఆన్​లైన్ బెట్టింగ్​కు అలవాటు పడి అందుకుగాను అప్పులు చేశాడు.

ఇంటివద్ద నుంచే పని చేస్తున్న అతడు.. ఆదివారం ఉదయం బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం బొల్లారం బజార్- అల్వాల్ రైల్వేస్టేషన్ల మధ్య ఓ యువకుడు మృతదేహం రైలు పట్టాలపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద లభ్యమైన సెల్​ఫోన్ ఆధారంగా మోహన్​ కృష్ణగా తేల్చారు. కుటుంబ సభ్యుల ద్వారా ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.