Thief Escape From Police Station: హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో దొంగతనం కేసులో అరవింద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం నిందితుడిని స్టేషన్లో ఉంచగా.. వాష్‌రూమ్‌కు వెళతానని చెప్పి పోలీసుల కళ్లుకప్పి పారిపోయాడు. దీంతో కంగుతిన్న పోలీసులు దొంగ కోసం వెతకసాగారు. ఇంత వరకు దొంగ ఆచూకీ దొరకలేదు. నిత్యం పోలీసులు పహరా కాస్తున్న ఒక్కసారిగా వారిని నమ్మించి గోడ దూకి పారిపోవడంతో పోలీసులు షాక్‌కి గురయ్యారు.
ఇవీ చదవండి: