పనిచేస్తుండగా పేలిన ల్యాప్‌టాప్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి - software employee injured
Software employee died in Laptop explosion: ఏపీలోని వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం మేకవారిపల్లి గ్రామంలో వర్క్ ఫ్రం హోమ్‌లో భాగంగా విధులు నిర్వహిస్తూ ల్యాప్‌టాప్ పేలడంతో గాయపడిన ఉద్యోగిని చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సుమతి.. ఇంటి దగ్గరే విధులు నిర్వహిస్తోంది. ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ పెట్టి ఒడిలో పెట్టుకుని పని చేస్తుండగా ఒక్కసారిగా పేలింది. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.
Software employee died in Laptop explosion: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18న ల్యాప్‌టాప్ పేలి తీవ్రంగా గాయపడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సుమతి మృతి చెందింది. వైఎస్సార్ జిల్లా బి. కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామానికి చెందిన సిద్దు సుమలత (22).. తిరుపతిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.
సంబంధిత వార్త: పనిచేస్తుండగా పేలిన ల్యాప్‌టాప్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పరిస్థితి విషమం
మండల పరిషత్తు మాజీ ఉపాధ్యక్షుడు, తెదేపా నాయకుడు సిద్దు వెంకటసుబ్బారెడ్డి, లక్ష్మీనరసమ్మ దంపతుల రెండో కుమార్తె సుమతి.. బెంగళూరులోని ఒక సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఈ నెల 18న తన ఇంట్లో మంచంపై కూర్చొని విధులు నిర్వహిస్తుండగా.. ఛార్జింగ్ పెట్టిన ల్యాప్‌టాప్ ఒక్కసారిగా పేలింది. పరుపు, మంచానికి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా సుమతి ఉద్యోగంలో చేరి మూడునెలలే అయింది.
ఇవీ చదవండి: 'నిన్ననే కొన్నారు.. ఇవాళ పేలింది.. ఒకరు చనిపోయారు'
No Ball Controversy: 'అది కరెక్ట్ కాదు కానీ.. మాకూ అన్యాయం జరిగింది'