ETV Bharat / crime

బైక్​ అదుపు తప్పి.. డివైడర్​ను ఢీకొని వ్యక్తి మృతి - సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం వార్తలు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కేశవాపురంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై వెళ్తుండగా బైక్​ అదుపు తప్పి డివైడర్​కు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

road accident, keshavapuram, suryapet
సూర్యాపేట, రోడ్డు ప్రమాదం, కేశవాపురం
author img

By

Published : Jan 29, 2021, 1:57 PM IST

అత్తారింటికి వెళ్తూ ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్​కు ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కేశవాపురంలో చోటుచేసుకుంది. కేశవాపురం గ్రామానికి చెందిన మిర్యాల ఉమేష్​.. నూతనకల్​లోని అత్తారింటికి బైక్​పై వెళ్తుండగా వాహనం ఒక్కసారిగా అదుపుతప్పింది. సమీపాన ఉన్న రోడ్డు సూచిక రాయిని బలంగా ఢీ కొట్టింది. ఈ క్రమంలో అతను పక్కనే ఉన్న బండ రాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలోనే ఉమేష్​ ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడికి రెండేళ్ల క్రితం నూతనకల్​కు చెందిన నవ్యతో వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం ఇటీవలే హైదరాబాద్​ వెళ్లిన అతను సోమవారం కేశవాపురానికి వచ్చాడు. గురువారం నూతనకల్​ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఉమేష్​ మృతితో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.