ETV Bharat / crime

MAN SUICIDE: వివాహిత ఇంటి ఎదుట వ్యక్తి ఆత్మాహుతి - తెలంగాణ వార్తలు

ఆమెకు పెళ్లైంది. అతనికీ పెళ్లైంది. ఇద్దరికీ వేర్వేరుగా ముగ్గురు, ముగ్గురు పిల్లలూ ఉన్నారు. ఆమె కొన్నాళ్లుగా భర్తతో విడిగా ఉండటంతో... అతను ఆమెకు దగ్గరయ్యాడు. ఆమె కూడా ఇంతకాలం అతనితో కలిసే ఉంది. కానీ ఆమె భర్త పిలవగానే.. అతడితో వెళ్లిపోయింది. అది తట్టుకోలేని ఆమె ప్రియుడు... పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

a-man-commits-suicide-in-front-of-his-girl-friend-home-at-hyderabad
వివాహిత ఇంటి ఎదుట వ్యక్తి ఆత్మాహుతి
author img

By

Published : Jul 27, 2021, 10:55 AM IST

Updated : Jul 27, 2021, 1:21 PM IST

‘ఇద్దరం ప్రేమించుకున్నాం.. కొంతకాలం కలిసి ఉన్నాం, ఒక్కసారిగా ఇప్పుడు నన్ను కాదంటోంది..’ అంటూ ఓ వివాహితుడు... ప్రేమించిన గృహిణి ఇంటి ముందే నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నారాయణగూడ సీఐ భూపతి గట్టుమల్లు వివరాల ప్రకారం.. నాగోల్‌ వాసి సురేశ్‌(35) హిమాయత్‌నగర్‌ ఓ జిరాక్స్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు. అక్కడే మరో సంస్థలో యాదవ గల్లీకి చెందిన ఓ మహిళ పని చేస్తోంది. ఆమె భర్తకు దూరంగా ఒంటరిగా ఉంటోంది. ముగ్గురు పిల్లలున్నారు. సురేశ్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఏడు నెలలు కలిసిమెలిసి తిరిగారు. ఇటీవల ఆ మహిళ మళ్లీ తన భర్త వద్దకు వెళ్లింది. ఆమె కోసం సురేశ్‌ భార్యతో గొడవ పడ్డాడు.

ప్రియురాలి కోసం... ఆత్మహత్యాయత్నం..

ప్రేమించిన మహిళకు మూడు నాలుగు రోజులుగా ఫోన్‌ చేస్తుంటే మాట్లాడటం లేదు. ప్రస్తుతం కుటుంబంతో నేను ఆనందంగా ఉన్నా.. మన సంబంధాన్ని ఇంతటితో ఆపేద్దామని ఆమె చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో మద్యం మత్తులో ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. స్థానికులు నచ్చజెప్పి పంపించేశారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో పెట్రోల్‌ సీసాతో వెళ్లి మళ్లీ తలుపు తట్టాడు. నీ కోసం చచ్చిపోతానంటూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకోవడంతో తీవ్రగాయాలపాలయ్యాడు.

చికిత్సపొందుతూ మృతి

సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షలో అతనికి కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని భార్యకు చెప్పగా, తొలుత రానని చెప్పినా.. పోలీసుల మాట గౌరవించి వచ్చి సేవలందించింది. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూయడంతో కన్నీరుమున్నీరైంది.

ఇదీ చూడండి: First Night : తొలిరాత్రి భర్త ప్రవర్తన చూసి నవవధువు షాక్..

Last Updated : Jul 27, 2021, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.