A husband killed his wife out of shame in Kamareddy district: భార్యపై అనుమానంతో భర్త ఆమెను విచక్షణ రహితంగా కొట్టి చంపేశాడు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం కామారెడ్డి జిల్లా నసురుళ్లబాధ్ మండలంలోని అంకొల్ తండాకి చెందిన రాంచందర్ కొన్ని రోజులుగా తన భార్య సోని(20)ని అనుమానిస్తూ ఉండేవాడు. రోజూ శారీరకంగా, మానసికంగా హింసిచే వాడు. చివరకు అనుమానం పెనుభూతంలా మారి ఈరోజు భార్య చేయి మనికట్టు దగ్గర కత్తితో కోసి, గొంతు నలిపి చంపేశాడు.
దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఆమెను తాడుతో దూలానికి వేలాడదీసి పారిపోయాడు. గ్రామ సర్పంచ్, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామచంద్రే చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. సోని మృతదేహన్ని పోస్ట్మర్టం నిమిత్తం బాన్సువాడ ప్రాంతంలోని హాస్పిటల్కి తరలించారు.
ఇవీ చదవండి: