ETV Bharat / crime

suicide: అన్న రాఖీ కట్టించుకోలేదని సోదరి ఆత్మహత్య - రాఖీ వార్తలు

రక్షాబంధన్​వేళ ఎంతో ఆశగా సోదరుడికి రాఖీ కడ్డానికి వచ్చిన ఓ సోదరి... తన అన్న రాఖీ (raksha bandhan) కట్టించుకోడానికి నిరాకరిండం వల్ల ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో జరిగింది.

suicide
suicide
author img

By

Published : Aug 22, 2021, 9:14 PM IST

కనుపాపకు రక్షణ నిచ్చే రెప్పవోలే.. కలకాలం కష్టాన్ని దరిచేరనివ్వని రక్షకుడివోలే... కాచి కాపాడే రక్త సంబంధాన్ని.. అనురాగమనే ధారంతో ముడివేసి.. మమతానురాగాలను గుర్తుచేసే పండుగే రాఖీ (raksha bandhan). ఇంతటి ప్రధాన్యత ఉన్న ఈ రోజు ఓ సోదరి.. తన సోదరుడు రాఖీ కట్టించుకోలేదని మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడింది(girl suicide). అన్న చేతికి రాఖీ ముడి వేయలేకపోయాయని... మెడకు ఉరితాడు బిగించుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో జరిగింది.

జహీరాబాద్ పట్టణం మాణిక్ ప్రభు వీధికి చెందిన బొగ్గుల మమత(20)... తన అన్న రమేశ్​కు రాఖీ కట్టేందుకు ఇంటికొచ్చింది. కానీ తన సోదరితో రాఖీ కట్టించుకోకుండా రమేశ్​ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాఖీ కట్టడానికి ఎంతలా బతిమాలినా వినిపించుకోలేదు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన మమత.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మృతురాలి పెద్ద అన్న ప్రేమవివాహం చేసుకున్నప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అన్న చెల్లి మధ్య మనస్పర్థలు రావడంతో రాఖీ కట్టించుకోలేదని.. మనస్తాపంతో మమత ఆత్మహత్య చేసుకుందని స్థానికులు అంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

'గత నాలుగేళ్లుగా వాళ్లు మా ఇంటిముందున్న ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇవాళ రక్షాబంధన్​ సందర్భంగా వాళ్ల అన్నకు రాఖీ కట్టడానికి మమత వచ్చింది. కొన్ని రోజులుగా వాళ్ల ఇంట్లో గొడవలు అవుతున్నాయి. మనస్పర్థల వల్ల చెల్లెలితో రాఖీ కట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మనస్తాపంతో ఆ అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.'

- స్థానికుడు.

ఇదీ చూడండి: డంపింగ్​ యార్డులో అప్పుడే పుట్టిన పసికందు.. అసలేమైంది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.