Kodandapur Accident Today : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కోదండపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన చిరు వ్యాపారులు పనులు ముగించుకొని ఆటోలో తిరుగు పయనం అయ్యారు. కోదండ పూర్ దగ్గర వారు ప్రయాణిస్తున్న ఆటోను.... హైదరాబాద్ నుంచి జమ్మలమడుగు వెళ్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఆటో ఎగిరి కిందపడగా... కారు బోల్తా కొట్టింది.
Gadwal Accident Today : ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో కారులో ఉన్నవారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం వేళ ఆటోలో 9 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.