Attack on traffic police: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కారు డ్రైవర్ దాడికి దిగాడు. అత్యంత వేగంగా వెళ్తున్న కారును ఆపేందుకు కానిస్టేబుల్ యత్నించాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన కారు డ్రైవర్ కానిస్టేబుల్‌పై దౌర్జన్యం ప్రదర్శించాడు. ఆవేశంతో అతనిపై పిడిగుద్దులు కురిపించాడు.
కానిస్టేబుల్‌పై దాడి చేసిన కారు డ్రైవర్‌ను భీమవరంలోని గునుపూడికి చెందిన సంతోశ్‌గా గుర్తించారు. కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి: అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తానని... అందినకాడికి దోచేశాడు
సిమ్‌కార్డు రాకెట్ గుట్టు రట్టు.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేరుతో చీటింగ్