ETV Bharat / crime

ఫొటోలను మార్ఫ్ చేసి.. బాలికకు బెదిరింపులు

తనతో ఛాటింగ్​ చేయట్లేదని.. పదోతరగతి అబ్బాయి... దారుణానికి ఒడిగట్టాడు. బాలిక ఫొటోలను మార్ఫింగ్​ చేసి.. బ్లాక్​ మెయిల్ చేయడం మొదలెట్టాడు. దీనితో బాలిక... తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులను ఆశ్రయించగా.. నిందితుడిని పట్టుకున్నారు.

a boy Morphed the photos, blackmailing a girl
'ఫోటోల​ని మార్ఫింగ్​ చేసి బెదిరించి.. ఇలా చిక్కాడు'
author img

By

Published : Apr 5, 2021, 8:56 AM IST

కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఆన్​లైన్​ తరగతుల కోసం పిల్లలకు మొబైల్ ఫోన్​లను వినియోగిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతపల్లి మండలానికి చెందిన ఓ బాలుడు తన పదో తరగతి క్లాస్​మేట్స్​కు వాట్సప్​ గ్రూపులో ఫొటోను చూసి ఆమెకు సందేశం పంపాడు. కానీ ఆమె స్పందించలేదు. స్పందించకపోగా అతని నంబర్‌ను బ్లాక్‌ చేసింది.

అప్పుడు అతను వాట్సప్ నుంచి ఆమె ప్రొఫైల్ పిక్చర్ స్క్రీన్ షాట్స్ తీసుకుని.. తన ఫొన్‌లో ఒక యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. నాలుగు వర్చువల్ నంబర్లను వాట్సప్‌లో నమోదు చేశాడు. ఫొన్​లో ఫొటో ఎడిటింగ్​ యాప్​ ఉపయోగించి... నగ్న మహిళల ఫొటోలతో మార్ఫింగ్ చేశాడు. నకిలీ వర్చువల్ నంబర్ల ద్వారా ఆమెకు పంపించాడు. నగ్నంగా వీడియో కాల్స్ చేయామని ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. లేదంటే ఫొటోలను ఇతరులతో పంచుకుంటానని బెదిరించాడు. దీంతో తల్లిదండ్రుల సహాయంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఐపీ అడ్రస్‌ ద్వారా నిందితుడిని పట్టుకున్నారు. అతనిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు​‌ నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.