ETV Bharat / crime

ganja seized in bhupalapalli : రూ.80లక్షల విలువైన గంజాయి పట్టివేత

author img

By

Published : Dec 21, 2021, 6:45 PM IST

ganja seized in bhupalapalli : భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం గాంధీనగర్​ క్రాస్​ వద్ద పెద్ద సంఖ్యలో గంజాయి పట్టుబడింది. రెండు కార్లలో తరలిస్తున్న రూ.80 లక్షల విలువైన 405 కిలోల ఎండు గంజాయిని ఘనపురం పోలీసులు సీజ్​ చేశారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ganja
ganja

ganja seized in bhupalapalli : జయశంకర్​ భూపాలపల్లి జిల్లా ఘనపురంలో గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రెండు కార్లలో తరలిస్తున్న 405 కిలలో ఎండుగంజాయిని ఘనపురం పోలీసులు సీజ్​ చేశారు. దీని విలువ సుమారు రూ.80లక్షలు ఉంటుందని తెలిపారు. ఘనపురం మండలం గాంధీనగర్​ క్రాస్​ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు రెండు కార్లపై అనుమానమొచ్చి పరిశీలించగా.. గంజాయి బయటపడింది. గంజాయి తరలిస్తున్నవారిలో ఇద్దరు పరరవ్వగా ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ గంజాయిని కొత్తగూడెం నుంచి భూపాలపల్లికి.. ఇక్కడి నుంచి హైదరాబాద్​కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో భూపాలపల్లి మండలం గొర్లవేడు గ్రామనికి చెందిన ఇద్దరు, చెల్పూర్, కొత్తగూడెం, భూపాలపల్లి నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు పరారయ్యాయని.. ముగ్గురు నిందితులను రెండు కార్లు, గంజాయిని సీజ్​ చేసినట్లు జిల్లా ఇంఛార్జి ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ వెల్లడించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గంజాయి ముఠాను పట్టుకున్న సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఆడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ సంపత్ కుమార్, ఎస్సైలు ఉదయ్, శ్రీకాంత్ రెడ్డి, చిట్యాల కృష్ణ ప్రసాద్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Bokkamanthulapadu knife attack : భార్యాభర్తల మధ్య గొడవ.. కళ్లలో కారం చల్లి.. కత్తులతో దాడులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.