ETV Bharat / crime

Road accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై ప్రమాదం.. 15 మందికి గాయాలు.. భారీగా ట్రాఫిక్​ జామ్​ - 15 members injured when lorry hits a bus in choutuppal

ప్రైవేటు బస్సును ఢీకొట్టిన టిప్పర్
ప్రైవేటు బస్సును ఢీకొట్టిన టిప్పర్
author img

By

Published : Sep 23, 2021, 7:02 AM IST

Updated : Sep 23, 2021, 8:01 AM IST

06:58 September 23

ప్రైవేటు బస్సును ఢీకొట్టిన టిప్పర్.. 15 మందికి గాయాలు

ప్రైవేటు బస్సును ఢీకొట్టిన టిప్పర్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలకేంద్రంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం(Road accident at Choutuppal) జరిగింది. టిప్పర్ లారీ ముందు టైర్ పగలడం వల్ల అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్​ బస్సును ఢీకొట్టింది(Road accident at Choutuppal). ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ క్యాబిన్​లో ఇరుక్కుపోగా.. స్థానికులు బయటకు తీశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇరు వాహనాల డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్​ వస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదం(Road accident at Choutuppal)తో హైదరాబాద్- విజయవాడ హైవేపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు రెెండు గంటలపాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగంలోకి దిగన పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్​ను క్లియర్ చేశారు. 

Last Updated : Sep 23, 2021, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.