దీపావళి పండగను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు ఆనందోత్సాహాల నడుమ నిర్వహించుకున్నారు. హనుమకొండలోని నివాసంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని మంత్రి ఆకాంక్షించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. లక్ష్మి పూజ అనంతరం ఆనందంగా టపాకాయలు కాల్చారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో కటుంబసభ్యులతో కలిసి బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా బాణాసంచా కాల్చారు.
ఖమ్మం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య కుటుంబసభ్యులతో కలిసి దీపావళి వేడుక్లలో పాల్గొన్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని పండగను ఆస్వాదించారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ టేకులపల్లి మండలంలోని స్వగ్రామంలో బంధుమిత్రుల మధ్య వేడుకలు జరుపుకున్నారు.
హనుమకొండలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. దీపపు కాంతులతో లోగిళ్లన్నీ దేదీప్యమానంగా వెలిగిపోయాయి. బాణాసంచా శబ్ధాలతో ఏకశిలా నగరం దద్దరిల్లిపోయింది. వెలుతురు పూలు విరజిమ్మిన చిచ్చుబుడ్డను కాల్చి సందడి చేశారు.
ఇదీచూడండి: Diwali Celebrations in Hyderabad: దీపావళి సంబురాలతో మురిసిన భాగ్యనగరం