వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పీజీ వైద్యురాలిపై దాడిని నిరసిస్తూ వైద్యులు విధులను బహిష్కరించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి చేతిలో సూది దిగగా.. చికిత్స కోసం ఎంజీఎంకు వచ్చారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. సూదీ లోతుగా దిగినందున మరో రోజు శస్త్ర చికిత్స నిర్వహిస్తామని వైద్యులు చెప్పారు. తక్షణమే సూదిని తొలగించాలని బాధితుడు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
కోపోద్రిక్తులైన బాధితుడు వైద్యురాలిపై అసహనంతో కుర్చీని విసిరి అసభ్య పదజాలంతో దూషించింది. ఆగ్రహంచిన వైద్యులు విధులను బహిష్కరించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన వైద్యులతో పోలీసులు చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు.