సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 2018 నివేదికను అమలుచేస్తూ పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 13న ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక. జనగామ జిల్లా కేంద్రంలో టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ ఛలో అసెంబ్లీ గోడ పత్రికను విడుదల చేశారు.
ఒప్పంద ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 2018 మే నెలలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం.. ఉద్యోగులందరూ ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.