ETV Bharat / city

మాతృమూర్తుల పాదపూజలో తరించిన చిన్నారులు - hanmakonda news

లోకంలో ప్రతి ఒక్కరికి కన్న తల్లిదండ్రులే కనిపించే దైవాలు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేలా వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో ఓం శ్రీ ఆర్గనైజేషన్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో పాద పూజ కార్యక్రమం నిర్వహించారు. జన్మనిచ్చిన తల్లులకు పాద పూజ చేస్తూ చిన్నారులు తరించిపోయారు.

children worshipped their parents in hanamkonda

author img

By

Published : Feb 23, 2021, 12:12 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓం శ్రీ ఆర్గనైజేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాతృమూర్తులకు పాద పూజ కార్యక్రమం నిర్వహించారు. తల్లులకు తమ చిన్నారులు పాదపూజ చేశారు. చిన్నప్పటినుంచే పిల్లలకు సంప్రదాయాలను అలవాటు చేస్తే క్రమశిక్షణతో మెలుగుతారని నిర్వాహకులు సంతోష్​ రెడ్డి తెలిపారు.

పిల్లలు తమ మీద ప్రేమ, గౌరవం, భక్తితో పాద పూజ చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని చిన్నారుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారులు పాద పూజ చేస్తున్న క్రమంలో కొంతమంది తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమయ్యారు.

ఇదీ చూడండి: కేసు ఓడిపోయాడని న్యాయవాది‌పై హత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.