ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా రెండోరోజు లక్ష మల్లెపూలతో అమ్మవారికి మల్లికా పుష్పార్చన నిర్వహించారు. పూలతో కాళీమాతను కొలిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ ప్రధాన అర్చకుడు శేషు తెలిపారు.
ఆదివారం అయినందున దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
ఇదీ చదవండిః మాజీ ఎమ్మెల్యే భిక్షపతి ఇంట్లో సోదాలు