వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఆశావర్కర్లు ఆందోళనకు దిగారు. నర్సింగ్ స్టాఫ్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్ అరుణ్‌ని విధుల్లోంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అతని వేధింపులు తాళలేక విజయలక్ష్మి అనే సీవో గతంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తోటి ఉద్యోగులు వెల్లడించారు.
అరుణ్ ప్రవర్తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. అందుకే విధులు ముగించుకుని ధర్నాకు దిగినట్లు ఆశా వర్కర్లు తెలిపారు. డాక్టర్ అరుణ్‌ను వెంటనే విధుల్లోంచి తొలగించాలని.. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండిః ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం