ETV Bharat / city

బహుదూరపు వలస బాటసారులు.. తీరని కష్టాలు - corona virus effect on daily weige labour

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​లో వలస కూలీల కష్టాలు వర్ణణాతీతం. సొంత ప్రాంతాలకు వెళ్లలేక, ఉన్న ప్రాంతాల్లో ఉండలేక వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

The hardships of desperate migrants
తీరని వలసకూలీల కష్టాలు..
author img

By

Published : Apr 22, 2020, 10:28 AM IST

లాక్​డౌన్​లో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు తమ ప్రాంతాలకు వెళ్లడానికి భార్యా పిల్లలతో కలిసి వందల కిలోమీటర్లు కాలిబాటన వెళ్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా గుండా గల 44వ నంబర్‌ జాతీయ రహదారిపై కాలిబాటన వెళ్తున్న కార్మికులు వందల మంది కనిపిస్తున్నారు. ఐదారేళ్లలోపు పిల్లలతో కలిసి మండుటెండలో నెత్తిన మూటలు పెట్టుకుని కార్మికులు నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి 200 కిలోమీటర్లు నడిచి వచ్చిన కార్మికులు.. తమ ప్రాంతాలకు వెళ్లాలంటే మరో 1000 కిలోమీటర్లు దూరం నడవాల్సి ఉందని వాపోయారు. బాల్కొండ మండలంలో వలస కార్మికులకు పలుచోట్ల దాతలు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. స్నాక్స్‌గా బిస్కెట్లు, పులిహోర ప్యాకెట్లు అందజేస్తున్నారు. వలస కార్మికుల ఆకలి తీరుస్తున్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంపై కరోనా పంజా.. సూర్యాపేటలో ఆందోళనకరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.