తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాల్లో చూపిస్తే రాజీనామా చేస్తానంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్ చేశారు. బీర్కూర్ మండలం దామరంచలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. రెండు పడక గదుల ఇళ్లు, రూ.2వేల పింఛన్, ప్రాజెక్టులు కట్టి రెండు పంటలకు నీళ్లివ్వడం, 24 గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రాలు దేశంలో ఉన్నాయా అని స్పీకర్ పోచారం ప్రతిపక్షాలను ప్రశ్నించారు. నిరూపిస్తే రాజీనామాకు సైతం సిద్ధమని పోచారం ప్రకటించారు. మైకు దొరికిందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదని హితవు పలికారు.
ఈ డబుల్ బెడ్రూం ఉందా మీ రాష్ట్రాలల్లో..? మాట్లాడే నాయకులను చెప్పమనండి. సవాల్ విసురుతున్న. పింఛన్ రూ.2000 ఇచ్చే రాష్ట్రం ఉందా.? 24గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఉందా దేశంలో ఎక్కడన్నా.? ప్రాజెక్టులు కట్టి రెండు పంటలకు రైతులకు నీళ్లిచ్చిన రాష్ట్రం ఉందా? గింజాకాడికెళ్లి ముక్క మిగిలకుండా ధాన్యం కొన్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడా.? మేం చేస్తుంది ఇది. ఎవరన్నా కాదంటారా.? జరగత లేవా ఇవన్ని. మేం జేసిన దానికన్న ఒక అక్షరం ఎక్కవ జేసి మాట్లాడు... నేను పొడిచేస్తా, కరిచేస్తా అని. ఇంట్లో కూర్చోని మాట్లాడతవ్. మైకు పట్టంగానే వాడ్ని ఓడిస్తం, వీడ్ని ఓడిస్తమని. ఎవరిని ఓడిస్తవ్.? నువ్వు ఓడించేది ఏంది? ప్రజలు ఓడిస్తరు. ఇవన్ని చేసే మిగితా రాష్ట్రాలు ఉన్నాయా చేప్పు.. నేనే రాజీనామా చేస్తేస్తా. ఒక్కటి చూపి నాకు ఎక్కడన్నా ఉంటే. సమాధానం చెప్పడానికి నేను తయారుగానే ఉంటా. - పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభాపతి.
ఇవీ చూడండి: గెజిట్ అమలుకు సహకరిస్తాం... కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రికి తెలిపిన సీఎం కేసీఆర్