నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద బజార్ ప్రాంతంలోని ఓ ఇంటిపై మూడు నెమళ్లు కనువిందు చేశాయి. సాయంత్రం సమయంలో వీధుల్లో తిరుగుతూ.. కూత పెడుతూ.. సందడి చేశాయి. కరోనా భయానికి జనాలంతా గడప దాటకుండా.. ఇంటికే పరిమితమైపోతే.. కొన్ని ప్రాంతాల్లో వన్యప్రాణులు జనారణ్యంలోకి వచ్చి.. రోడ్ల మీద పెద్దగా జనసంచారం లేకపోవడం వల్ల స్వేచ్ఛగా విహరిస్తున్నాయి.
ఇదీ చదవండి: మాస్క్‌లేకుండా బయటకొచ్చారు.. అలా బుక్కయ్యారు!