నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా వద్ద 39, 40, 41వ డివిజన్లలో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గణేశ్ బిగాల భూమి పూజ చేశారు. అనంతరం రఘునాథ చెరువు మినీ ట్యాంక్‌బండ్ వద్ద చేపడుతోన్న సుందరీకరణ పనులని అధికారులతో కలసి పరిశీలించారు.
నగర ప్రజలు ఎదురు చూస్తున్న మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ట్యాంక్‌బండ్ సందర్శనకు వచ్చే వారి వాహనాలకు 3 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్‌తోపాటు శౌచాలయాలు, ఇతర సౌకర్యాలు నిర్మిస్తున్నారని స్పష్టం చేశారు.
అతి త్వరలో ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, కార్పొరేటర్లు, అధికారులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'వారందరికీ అందేంతవరకు పల్స్ పోలియో కార్యక్రమం'