ETV Bharat / city

పని పూర్తైంది.. నడిరోడ్డుపై వదిలేశాడు!

భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద వలస కూలీల మూడురోజులుగా పడిగాపులు కాస్తున్నారు. ఇన్నిరోజులు వీరంతా దోమకొండ మండలంలో ఇటుకబట్టీలో పనిచేశారు. పని పూర్తయ్యే సరికి కూలీలను ఇటుకబట్టీల యజమాని టోల్‌గేట్‌ వద్ద వదిలివెళ్లిపోయాడు.

పని పూర్తైంది.. నడిరోడ్డుపై వదిలేశాడు
పని పూర్తైంది.. నడిరోడ్డుపై వదిలేశాడు
author img

By

Published : Jun 4, 2020, 2:36 PM IST

ఆపదలో ఆదుకుంటాడనుకున్న యజమాని నడిరోడ్డుపై వదిలేశాడు. కామారెడ్డి జిల్లా భిక్కునూరు టోల్​ప్లాజా వద్ద ఒడిశాకు చెందిన సుమారు 90 మంది వలస కార్మికులు మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. ఒడిశాకు చెందిన కొందరు కార్మికులను దోమకొండ మండలంలోని ఇటుక బట్టిలో పనికి కుదుర్చుకున్నాడు ఓ యజమాని. పనిపూర్తయ్యే సరికి ఉన్నపళంగా వారిని వెళ్లిపోమని చెప్పాడు.

కార్మికులందరినీ వారి రాష్ట్రంలో దిగబెడతామని నమ్మబలికి బిక్నూరు టోల్​ ప్లాజా వద్ద వదిలేశాడు. మూడురోజులుగా చిన్నపిల్లలు ఆకలితో అలమటిస్తుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని బోరుమంటున్నారు. తినడానికి ఏమి లేక పట్టెడన్నం పెట్టే వారి కోసం ఎదురు చూస్తున్నారు.

భిక్కునూరు టోల్​ప్లాజా వద్ద ఒడిశాకు చెందినవలస కార్మికులు

ఇవీ చూడండి: చేపలు వలలోకి.. భద్రత గాలిలోకి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.