నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆనంద్‌నగర్‌లో నాలుగు నెలల బాలుడిని విక్రయించిన ఘటన గురువారం కలకలం సృష్టించింది. పుట్టిన బిడ్డను తనకు తెలియకుండా మరొకరికి అమ్మారంటూ.. ఓ మహిళ కొనుగోలు చేసిన వారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. సమాచారం అందుకున్న ఐదో ఠాణా పోలీసులు శిశువును ఐసీపీఎస్ అధికారులకు అప్పగించగా వారు శిశుగృహాకి తరలించారు.
నిజామాబాద్ ఆనంద్‌నగర్‌కు చెందిన సునీత.. మక్లూర్ మండలం అలూర్‌కు చెందిన ఓ చిన్నారిని.. ఇద్దరు మధ్యవర్తుల సాయంతో కొనుగోలు చేసింది. కన్నతల్లి, వారి బంధువుల సమక్షంలో ఇద్దరి ఒప్పందంతోనే రూ.40 వేలు ఇచ్చి కొనుగోలు చేశామని.. కొనుగోలు చేసిన మహిళ చెబుతోంది.
తాజాగా కన్నతల్లి మాత్రం తనకు తెలియకుండా అమ్మారంటూ.. వెంటనే చిన్నారిని ఇవ్వాలంటూ ఆనంద్‌నగర్‌లో నిరసన తెలిపింది. ఈ విషయం ఐదో ఠాణా పోలీసులకు తెలియడంతో వివరాలు సేకరించారు. ఐసీపీఎస్ అధికారులను రప్పించి శిశువును అప్పగించారు. విచారణ పూర్తయ్యే వరకు తమ వద్ద బిడ్డ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
ఇవీ చదవండి: