ఇవాళ సాగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 12న్నరకు నందికొండకు చేరుకుని... అక్కడినుంచి రోడ్డుమార్గంలో నెల్లికల్లుకు వెళ్తారు. 12 గంటల 45 నిమిషాలకు నెల్లికల్లుతోపాటు మరో 9 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసి... నాగార్జునసాగర్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.
మధ్యాహ్నం ఒంటిగంటకు హిల్‌కాలనీ చేరుకుని మండలి ఛైర్మన్ గుత్తా నివాసంలో భోజనం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హాలియా సభకు బయల్దేరతారు. 3గంటల10 నిమిషాలకు పాలెం శివారులోని సభాస్థలికి చేరుకోని... అక్కడ భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4గంటల 10 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం అవుతారని అధికారులు వెల్లడించారు.
సాగర్ ఉపఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో... ఉమ్మడి జిల్లాపై వరాలు కురిపించే అవకాశం ఉండవచ్చని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా... పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.