నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మగూడెంలోని రైల్వే ట్రాక్‌ను టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. రైల్వే ట్రాక్ అడ్డంగా ఉండటం వల్ల వ్యవసాయ పనుల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని స్థానిక రైతులు ఉత్తమ్‌కు విన్నవించారు. అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేసి తమ సమస్య పరిష్కరించాలని కోరారు.
స్పందించిన ఎంపీ రైల్వే జనరల్ మేనేజర్‌తో మాట్లాడి సత్వరమే సమస్య పరిష్కారిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, పున్న కైలాష్ నేత, మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, నల్గొండ ఎంపీపీ సుమన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ పాశం నరేష్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ బొంత వెంకటయ్య, ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, నాయకులు దొంతినేని నాగేశ్వర్ నావు, తండు నర్సింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మంత్రి జగదీశ్‌రెడ్డి వర్సెస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి