నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధిస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజల్లో ప్రభుత్వం, కేసీఆర్ పట్ల సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఈ ఏడేళ్లలో ఏ ఎన్నికలు వచ్చినా తెరాస తిరుగులేని మెజార్టీతో గెలిచిందన్నారు. ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుందని... కావాలనే కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు.
ఓటరు నమోదుపై పట్టభద్రుల్లో అవగాహన కల్పించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,456 కరోనా కేసులు, 5 మరణాలు