మహిళలు స్వయం సమృద్ధి దిశగా ఎదిగేందుకు ఉచిత శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు డా. ఆరుట్ల కమలాదేవి రామచంద్రా రెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ సుశీలదేవి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూర్ గ్రామంలో.. డా. ఆరుట్ల కమలాదేవి రామచంద్రా రెడ్డి ఫౌండేషన్, స్వామి రామానందతీర్ధ రూరల్ ఇనిస్ట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. గ్రామీణ మహిళలకు ఉచిత కుట్టు మెషీన్, ఎంబ్రాయిడింగ్ వర్క్‌తో పాటుగా మగ్గం వర్క్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపిన ఛైర్మన్.. మహిళలు అందరూ ఈ శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
స్వయంగా ఎదిగేలా..
మహిళ అంటే ఆరుట్లరామచంద్ర రెడ్డికి చాలా గౌరవమని తెలిపిన కమలాదేవి.. స్వంతంగా ఎదగాలని కోరుకునే మహిళలకు ఫౌండేషన్ ద్వారా ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి స్వయంగా ఉపాధి పొందే అవకాశం కల్పిస్తామని తెలిపారు .
మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ఈ శిక్షణ కేంద్రాలను ఆలేరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేశాం. శిక్షణ కేంద్రాలే కాకుండా ప్రతి సంవత్సరం ఫౌండేషన్ ద్వారా స్పాట్స్ కూడా నిర్వహిస్తాం. ఈ సారి కరోనా కారణంగా స్పాట్స్ నిర్వహించలేక పోయాం. 2010 లో కొలనుపాకలో మొదటి సారిగా శిక్షణ కేంద్రం నిర్వహించాం. భవిష్యత్‌లో మరికొన్ని గ్రామాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
-ఆరుట్ల సుశీలదేవి , డా.ఆరుట్ల కమలాదేవి రామచంద్రా రెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్
ఇదీ చదవండి: రోజూ 10లక్షల మందికి టీకా ఇచ్చేందుకు సిద్ధం : ఈటల