ETV Bharat / city

భాజపా నేతలపై కావాలనే తప్పుడు కేసులు: రామచందర్​రావు - ఓటరు నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచందర్​రావు

భాజపా ప్రజాప్రతినిధులను అధికార పార్టీ నేతల ఒత్తడితో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఎమ్మెల్సీ రామచందర్​ రావు ఆరోపించారు. అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.

అధికార పార్టీ నేతల ఒత్తడితో తప్పుడు కేసులు: రామచందర్​రావు

author img

By

Published : Oct 20, 2020, 4:14 PM IST

మహబూబ్​నగర్ జిల్లాలో భాజపా తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులపై అధికార పార్టీ నేతల ఒత్తిడితో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఎమ్మెల్సీ రామచందర్​రావు మండిపడ్డారు. అప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీలు మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మహబూబ్​నగర్​లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

పట్టణంలోని భగీరథ కాలనీలో ఇంటింటికీ తిరిగి... ఓటరు నమోదు కోసం దరఖాస్తులను అందించి, అవగాహన కల్పించారు. నవంబరు 6 వరకు గడువు ఉందని... అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్షాలతో జిల్లాలో పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాయని... ప్రభుత్వం వెంటనే వివరాలు సేకరించేలా కలెక్టర్లను ఆదేశించి, రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.