ETV Bharat / city

తొమ్మిది హత్యకేసులున్న వ్యక్తితో స్టేజ్​ పంచుకోలేను, మాణికం ఠాగూర్‌కు లేఖ - మానిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇన్‌ఛార్జి అనిరుధ్‌రెడ్డి లేఖ

జడ్చర్ల నియోజకవర్గంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జీ మాణికం ఠాగూర్‌కు ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ అనిరుధ్​రెడ్డి వాట్సాప్ ద్వారా లేఖ పంపారు. తొమ్మిది మర్డర్‌ కేసులలో నిందితుడిగా ఉన్న ఎర్ర శేఖర్‌తో స్టేజ్‌ పంచుకోలేనంటూ మాణికం ఠాగూర్‌కు స్పష్టం చేశారు.

Anirudh Reddy
Anirudh Reddy
author img

By

Published : Aug 18, 2022, 12:56 PM IST

Updated : Aug 18, 2022, 2:21 PM IST

జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆ నియోజకవర్గ ఇంచార్జ్‌ అనిరుధ్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి నుంచి పార్టీలో పనిచేసుకుంటున్న తనను ఎర్ర శేఖర్ ఇబ్బందులు గురి చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జీ మాణికం ఠాగూర్‌కు అనిరుధ్‌రెడ్డి వాట్సాప్‌ ద్వారా లేఖ పంపారు. తొమ్మిది మర్డర్‌ కేసులలో నిందితుడిగా ఉన్న ఎర్ర శేఖర్‌తో స్టేజ్‌ పంచుకోలేనంటూ మాణికం ఠాగూర్‌కు స్పష్టం చేశారు. ఎర్ర శేఖర్‌ సర్పంచ్‌ పదవి కోసం సొంత తమ్ముడినే హత్య చేశారంటూ తీవ్ర ఆరోపణ చేశారు. పార్టీలో చేర్చుకునే సందర్భంగా ఒక మాట... ఇప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారంటూ అవేదన వ్యక్తం చేశారు.

'పబ్లిక్ అంటున్నారు ఇదేంటి ఇప్పుడు ఎర్ర శేఖర్​ను తీసుకున్నారు. దేవరకద్ర, మక్తల్​లో తెదేపా వాళ్లను తీసుకుంటున్నారు. ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ వాళ్ల పరిస్థితి ఏం అవుతదంటున్నారు. నాతో ఉన్న క్యాడర్ కూడా పదే పదే అదే చెబుతుంది. తొమ్మిది మర్డర్‌ కేసులలో నిందితుడిగా ఉన్న ఎర్ర శేఖర్‌తో స్టేజ్‌ పంచుకోలేను. సర్పంచ్‌ పదవి కోసం సొంత తమ్ముడినే హత్య చేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం మిమ్మల్ని చంపరేమని ఉందని క్యాడర్ అంటున్నారు. నేను ఇలాంటి వాటికి ఏం భయపడను. నాకు ఇంతవరకు మాణికం ఠాగూర్ నుంచి రిప్లై రాలేదు. సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను.'-అనిరుధ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత

తొమ్మిది హత్యకేసులున్న వ్యక్తితో స్టేజ్​ పంచుకోలేను, మాణికం ఠాగూర్‌కు లేఖ

ఇవీ చదవండి:

Last Updated : Aug 18, 2022, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.