Bhadradri Temple News: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో టికెట్ ధరలు పెంచుతూ ఆలయ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న 100 గ్రాముల చిన్న లడ్డును రూ.20 నుంచి రూ.25కు, పులిహోర రూ.10 నుంచి రూ. 15కు, చక్కెరపొంగిలి రూ.10 నుంచి రూ.15కు, కేశఖండన టిక్కెట్ రూ.15 నుంచి రూ.20కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రూ. 100 ఉన్న మహాలడ్డును 500 గ్రాముల నుంచి 400 గ్రాములకు తగ్గించారు. నిత్యకల్యాణం రూ.1,500, అర్చన రూ.300, అభిషేకం టికెట్ రూ.1,500కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త టికెట్ల ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని దేవస్థానం పేర్కొంది.
ఇదీ చదవండి:Yadadri: యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలు నిషేధం.. ఉచితంగా భక్తుల తరలింపు