విశాలమైన చలువ పందిళ్ల కింద.. భారీ జనసందోహం మధ్య ప్రతి ఏడాది జరిగే రామయ్య కళ్యాణం.. ఈసారి కరోనా ప్రభావంతో నిరాడంబరంగా జరిగింది. అతి కొద్దిమంది సమక్షంలో.. ఆలయ ద్వారాలకు తాళాలు వేసి రామయ్య కల్యాణం నిర్వహించారు. కేవలం అర్చకులు, ఆలయ కమిటీ వారు మాత్రమేపాల్గొని స్వామివారి కల్యాణం జరిపించారు. గుడి తలుపులు మూసి తాళాలు వేయడం వల్ల చాలామంది భక్తులు గుడి బయటి నుంచే దండం పెట్టుకున్నారు.
ఖమ్మం జిల్లాలోని వైరా నది సమీపాన ఉన్న పురాతన సీతారాముల ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. భక్తులు లేకుండా కేవలం వేదపండితుల ఆధ్వర్యంలోనే ఈ కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపించారు. కొద్దిమంది భక్తులు మాత్రమే హాజరై భౌతిక దూరాన్ని పాటిస్తూ సీతారాముల కల్యాణాన్ని తిలకించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు, జనార్ధన్ ఆచార్యులు, శేషాచార్యులు, దేవాదాయ శాఖ ఉద్యోగి రాధల ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు జరిపించారు.