ETV Bharat / city

లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు అందించిన ఎంపీ నామ - సీఎంఆర్​ఎఫ్​ చెక్కుల పంపిణీ

అనారోగ్యంతో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన లబ్ధిదారులకు... ఎంపీ నామ నాగేశ్వర రావు సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు అందించారు. నిరుపేదలకు సీఎంఆర్​ఎఫ్​ ఓ వరంగా మారిందని ఎంపీ అన్నారు.

mp nama nageshwer rao distrubute cmrf cheques in khammam
లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు అందించిన ఎంపీ నామ
author img

By

Published : Sep 14, 2020, 6:10 PM IST

ఖమ్మం జూబ్లీపురంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు... నామ నాగేశ్వరరావు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులు... ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఎంపీ సిఫార్సుతో దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన రూ.8లక్షల 28 వేల విలువైన చెక్కులను 21 మంది లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్​, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, పీఏసీఎస్​ ఛైర్మన్​లు, మండలపార్టీ అధ్యక్షులు, సర్పంచ్​లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 8 బిల్లులకు శాసనసభ ఆమోదం... రేపటికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.