'అన్నం' పెడుతున్న సేవాసంస్థకు ఆర్పీఎఫ్ చేయూత - Khammam Railway Protection Force Police Distributes Groceries To NGO
లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదలకు సహాయం చేసేందుకు పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఆ క్రమంలో ఖమ్మంలో రైల్వే పోలీసులు అన్నార్తుల ఆకలి తీరుస్తున్న ఓ స్వచ్ఛంధ సంస్థకు నిత్యావసరాలు అందజేశారు.

400 మంది అనాథల ఆకలి తీరుస్తున్న సేవాసంస్థ
లాక్డౌన్ సమయంలో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న పేదలకు పలువురు దాతలు సహాయం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు పేదల ఆకలి తీరుస్తున్న 'అన్నం సేవాసంస్థ'కు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సంస్థలో దాదాపు 400 మంది అనాథలు ఆశ్రయం పొందుతున్నారు. వారి ఆకలి తీర్చేందుకు ఖమ్మం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు తమ వంతు సాయంగా నిత్యావసర సరుకులు అందించారు. మరోవైపు స్టేషన్ రోడ్డులోని వలస కూలీలకు తెదేపా కార్యకర్తలు ఆహారం పొట్లాలు పంచారు.
ఇవీ చూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు